గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2015 (09:25 IST)

ఇప్పట్లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఛాన్సే లేదు: క్రిస్ గేల్

2016 కొత్త సంవత్సరంలో సంప్రదాయ టెస్టుల్లో పునరాగమనం చేస్తానని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పట్లో తాను క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశమే లేదని క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. విండీస్ టెస్టు జట్టులోకి రావడమే తన ముందున్న ప్రథమ లక్ష్యమని తెలిపాడు. 2014లో చివరి టెస్టు ఆడిన గేల్‌కు ప్రస్తుతం 36 సంవత్సరాలు. వెన్నునొప్పితో బాధపడుతూ వస్తున్న క్రిస్ గేల్ కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో వెన్నునొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, ఇంకా పూర్తిగా కోలుకోలేకపోలేదన్నాడు. ఒకవేళ ఫిట్‌నెల్ సాధించివుంటే ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యేవాడినని క్రిస్ గేల్ నమ్మకం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటివరకు 103 టెస్టులాడిన క్రిస్ గేల్.. 2016లో తప్పకుండా విండీస్ టెస్టు టీమ్‌లో స్థానం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.