1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Did Indian women's cricket captain Harman grab Pakistan women-s captain Sana by the throat? Is it true? Video

పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ సనా గొంతుకాయ పట్టుకున్న ఇండియన్ మహిళా కెప్టెన్ హర్మాన్, నిజమా? వీడియో

Fatima Sana Sheikh
ఆదివారం రాత్రి ఐసీసి మహిళా ప్రపంచ కప్ టీ20 పోటీల్లో భాగంగా పాకిస్తాన్ మహిళా జట్టును భారతదేశ మహిళా జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా భారత మహిళా జట్టుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిట్లా వుంటే... కొంతమంది ఏఐ టూల్స్ వుపయోగించి ఇరు జట్ల కెప్టెన్లు ఘర్షణ పడినట్లు చూపిస్తున్నారు.
 
పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ నేరుగా ఇండియన్ లేడీ క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వాగ్వాదం జరిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. అందులో హర్మన్ ఆగ్రహంతో సనా షేక్ గొంతుకాయ పట్టుకున్నట్లు చూపించారు. వాస్తవానికి ఇదేమీ జరగలేదు. అంతా ఫేక్ వీడియో. అసలు ఆటగాళ్లు పరస్పరం కనీసం షేక్ హ్యాండ్స్ కూడా తీసుకోలేదు. దేశాల మధ్య పరిస్థితి చాలా సున్నితంగా వున్నప్పుడు ఇట్లాంటి వీడియోలు క్రియేట్ చేయడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుర్ర లేని పనులు చేయవద్దని హితవు పలుకుతున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఫిఫా వరల్డ్ కప్‌.. రాత్రికి రాత్రే హీరో అయిన గోల్ కీపర్ కాబో వెర్డే