వందో టెస్టు ఆడనున్న డివిలియర్స్: అవసరమైతే స్లెడ్జింగ్ చేస్తా!

de villiers
Selvi| Last Updated: శుక్రవారం, 13 నవంబరు 2015 (13:35 IST)
భారత్‌తో జరిగిన తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన సఫారీలు బెంగళూరులో జరిగే రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు.. అవసరమైతే స్లెడ్జింగ్ కూడా చేసేందుకు తాను వెనుకాడబోనని టీమిండియా కెప్టెన్ కోహ్లీకి దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ హెచ్చరికలు జారీ చేశాడు. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు తాను మంచోడిని కాదని, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు అవసరమైతే స్లెడ్జింగ్ చేసేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశాడు. తనకు గెలవడమే ముఖ్యమన్నాడు.

అయితే గ్రౌండ్ బయట తాను చాలా మంచి వ్యక్తినని డివిలియర్స్ తెలిపాడు. కోహ్లీ టెక్నిక్, చిన్న లోపాలను గురించి కామెంట్ చేస్తూ అతడి ఏకాగ్రతను దెబ్బతీస్తానని చెప్పాడు. డివిలియర్స్ శనివారం వందో టెస్టు ఆడుతున్నాడు. ఈ సందర్భంగా డివిలియర్స్ మాట్లాడుతూ.. ఇంత స్థాయికి ఎదుగుతానని, 100వ టెస్ట్ ఆడుతానని తాను ఎన్నడూ ఊహించలేదని.. ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని చెప్పాడు.దీనిపై మరింత చదవండి :