1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Hardik Pandya Goes Bald After Offering Hair At Tirupati Balaji Temple

కొత్త ప్రియురాలితో శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా - గుండుతో న్యూ లుక్

hardik pandya - mahika sharma
భారత్ క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కొత్త ప్రియురాలు మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ప్రియురాలితో కలిసి ఆదివారం వేకువజామున ఆలయానికి చేరుకున్న పాండ్యా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాండ్యా తన మొక్కు చెల్లించుకుంటూ శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. 
 
సంప్రదాయ దుస్తులైన తెల్ల కుర్తా, పైజామా ధరించి గుండుతో ఉన్న హార్దిక్ పాండ్యా పూర్తిగా కొత్త రూపంలో కనిపించాడు. తిరుమల మాఢ వీధులు, పుర వీధుల్లో పాండ్యాను చూసిన క్రికెట్ అభిమానులు, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. తిరుమల క్షేత్రంలో తలనీనాలు సమర్పించడం భక్తికి చిహ్నంగా, ముఖ్యమైన మొక్కుగా భక్తులు భావిస్తారు. 
 
దర్శనం అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలో పండితులు హార్దిక్ పాండ్యా, మహిళా శర్మకు వేదాశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత వారికి స్వామివారి తీర్థప్రసాదాలను పట్టువస్త్రాలను అందజేశారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, ప్రియురాలు మహికా శర్మకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కామన్వెల్త్ క్రీడా పోటీలు : భారత్ పతకాల మోత