శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (09:53 IST)

హార్దిక్ పాండ్యా అదుర్స్: ఒకే ఓవర్లో ఏకంగా 34 పరుగులు.. ఎలా?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరపున గత ఏడాది తన సత్తా ఏంటో నిరూపించుకున్న హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పొట్టి ఫార్మాట్ జట్టుకు అతడు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం దేశంలోనే ఉన్న హార్దిక్... దేశవాళీ సయ్యద్ ముస్తాక్ టోర్నమెంట్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. సోమవారం జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో సిక్సర్లతో విజృంభించాడు. ఒకే ఓవర్లో ఏకంగా ఐదు సిక్సులు బాదేసిన అతడు ఆ ఓవర్లో ఏకంగా 39 పరుగులు సాధించాడు. ఇంకో బంతిని కూడా అతడు బౌండరీ లైన్ దాటింగ్ ఫోర్‌గా మలిచాడు.
 
ఈ టోర్నీలో బరోడా తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా ఆటతీరుకు ఢిల్లీకి చెందిన మీడియం పేసర్ ఆకాశ్ సుడాన్ బెంబేలెత్తిపోయాడు. ఈ క్రమంలో ఐదు పరుగులను ఎక్స్ ట్రాగా సమర్పించుకున్నాడు. దీంతో ఐదు సిక్స్‌లు (30 రన్స్), ఓ ఫోర్ (4 రన్స్)తో 34 పరుగులను హార్దిక్ రాబట్టాడు. ఎక్స్ ట్రాగా వచ్చిన ఐదు పరుగులతో కలుపుకుని ఒకే ఓవర్‌లో 39 పరుగులు బరోడా ఖాతాలో చేరిపోయాయి. దీంతో ఢిల్లీపై బరోడా సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది.