సంబంధిత వార్తలు
- RCB: ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అదుర్స్
- Smriti Mandhana: శ్రీలంకతో సిరీస్.. 10వేల పరుగులు సాధించిన స్మృతి మంధాన
- Smriti Mandhana: అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు చేసిన స్మృతి మంధాన
- Smriti mandhana: తెలుపు డ్రెస్లో దేవతలా మెరిసిపోతున్న స్మృతి మంధాన
- Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్మృతి మంధాన
Smriti Mandhana, పాకిస్తాన్ బౌలర్లను చితక్కొట్టిన స్మృతి మంధన, భారీ విజయం
Smriti Mandhana ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎడ్జెబ్‌స్టన్‌లో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా బ్యాట్సమన్లు దూకుడుగా ఆడారు. స్మృతి మంధన కేవలం 44 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టి 68 పరుగుల భారీ పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు ముందు భారీ లక్ష్యం వుంచగలిగినట్లయ్యింది. షెఫాలీ వర్మ 6 పరుగులకే ఔటయ్యింది. జెమీయ 1 పరుగు, హర్మన్ ప్రీత్ 36 పరుగులు, భర్తి 1, రిచా ఘోష్ 34, దీప్తి 12, శ్రేయాంక 1 పరుగు చేసారు. 20 ఓవర్లకు భారత్ 170 పరుగులు చేసింది.
ఈ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు తొలుత ఒకింత కట్టుదిట్టంగా ఆడినా వరుస వికెట్లు కోల్పోవడంతో పరాజయం పాలైంది. మునీబా 41, ఫిరోజా 12, అయేషా 12, సైరా 2, నతాలియా 7, ఫాతిమా 0, అలియా 18, రమీమ్ 4, నశ్రా 4, తస్మియా 0, సాదియా 1 పరుగులు చేసారు. 17 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. కేవలం 106 పరుగులు చేసారు.
Smriti Mandhana - 68(44)
— MANU. (@IMManu_18) June 14, 2026
Harmanpreet Kaur - 36(35)
Richa Ghosh - 34(17)
Deepti Sharma - 12(9)
Indian Women post 170/6 against Pakistan Women in ICC T20 World Cup at Edgbston.
Come Harman & her Army.pic.twitter.com/hGlf6gOecR
Smriti Mandhana is all over the Pakistan
Ind vs Pak
— SAHILTACION (@sahilisdamn) June 14, 2026
T20 WC 2026 pic.twitter.com/oyzG9rfmbH
