1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India could lose Vaibhav Sooryavanshi: Dale Steyns warning as he places whiz kid above Sachin Tendulkar, Virat Kohli

వైభవ్ సూర్యవంశీ.. భారత జట్టుకు అతిపెద్ద ఖజానా : డేల్ స్టెయిన్

vaibhav suryavanshi
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు దొరికిన అతిపెద్ద ఖజానా అని వ్యాఖ్యానించాడు. అతన్ని భారత క్రికెట్ జట్టు కాపాడుకోవాలని సూచించాడు. అయితే, వైభవ్ ఫామ్ కోల్పోతే మాత్రం ఇబ్బందులు పడుతాడని చెప్పుకొచ్చాడు. 
 
ఇదే అంశంపై డేల్ స్టెయిన్ మాట్లాడుతూ, ప్రపంచ క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ అద్భుతాలు సృష్టిస్తాడన్నాడు. అతడు భారత క్రికెట్‌కు ఖజానా లాంటివాడని అభివర్ణించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ కంటే వైభవ్‌లోనే ఎక్కువ సత్తా ఉందని పేర్కొన్నాడు. ఇప్పుడు అతడి వయసులో ఉన్న పిల్లల్లో ఇలాంటి టాలెంట్‌ను చూడలేదని చెప్పాడు. 
 
'మీరంతా వైభవ్ సూర్యవంశీని సచిన్‌ లేదా విరాట్‌లా ఉన్నాడని భావిస్తారు. కానీ, వారిద్దరి కంటే కూడా ఇతడిలో చాలా సత్తా ఉందని అనిపిస్తోంది. వైభవ్‌ కెరీర్‌ ముగిసేసరికి ఆ దిగ్గజాలను అధిగమిస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడున్న అంతర్జాతీయ క్రికెటర్ల కంటే కూడా వైభవ్‌ చాలా బెటర్. అండర్ -15, అండర్ -19 జట్లలో అద్భుతమైన ఆటగాళ్లను చూస్తూ ఉంటాం. కానీ, నాకు తెలిసి దక్షిణాఫ్రికా లేదా ఇతర దేశాల్లో వైభవ్‌ వంటి నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్ లేడు. మా దేశంలో టాలెంట్‌కు కొదవేం లేదు. కానీ, వైభవ్‌ వంటి బెస్ట్ ప్లేయర్‌ లేడని మాత్రం చెప్పగలను. అందుకే, అతడు భారత జట్టుకు అతిపెద్ద ఖజానా అంటున్నా' అని స్టెయిన్ తెలిపాడు.
 
'ప్రస్తుతం వైభవ్‌ వయసు కేవలం 15 ఏళ్లే. రాబోయేకాలం అత్యంత విలువైంది. అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్‌పై ఉంది. వైభవ్‌ను ఎంత బాగా చూసుకుంటే.. టీమ్‌ఇండియాకు అంత బెనిఫిట్‌. ఒకవేళ అతడి ఆటను కోల్పోతే మాత్రం చాలా నష్టమవుతుంది. బంతిని చాలా బాగా ఆడతాడు. భారత్‌లో అతడి ఆటను దగ్గర్నుంచి చూశా. మంచి వికెట్లపైనా ఉత్తమ ఆటతీరు ప్రదర్శించాడు అని గుర్తు చేశాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా ఇకలేరు...