దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు : కోహ్లీ డకౌట్.. 77 పరుగుల వద్ద పూజారా అవుట్!

Selvi| Last Updated: శనివారం, 7 నవంబరు 2015 (11:19 IST)
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు పట్టు లభించింది. రెండో ఇన్నింగ్స్ నిదానంగా సాగుతూ.. ఆధిక్యం దిశగా టీమిండియా పయనిస్తోంది. 125/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్ పుజారా, కెప్టెన్ కోహ్లీల జోడి నిదానంగా ఆడుతూ, స్కోరును ముందుకు తీసుకెళ్లింది.

అయితే వీరిద్దరూ నిలకడగా ఆడినా.. కోహ్లీ 29 పరుగుల వద్ద జీల్ బౌలింగ్‌లో అవుటైయ్యాడు. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా బౌలర్ల ఎత్తులకు చిక్కకుండా కోహ్లీ పూజారా రాణించారు. అయితే కోహ్లీ డకౌట్ కాగా, పుజారా అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

అయితే 77 పరుగుల వద్ద పూజారా కూడా ఇమ్రాన్ తహీర్ బంతికి పెవిలియన్ చేరాడు. అనంతరం దిగిన భారత బ్యాట్స్‌మెన్లు రహానే (2)కూడా స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సహా (6), జడేజా (8)లు క్రీజులో ఉన్నారు. తద్వారా భారత్ 64.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది.దీనిపై మరింత చదవండి :