1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India will need Rohit and Virats qualities to win the World Cup: Irfan Pathan

వారిద్దరు ఉంటేనే వరల్డ్‌ కప్‌లో భారత్ విజయావకాశాలు : ఇర్ఫాన్ పఠాన్

irfan pathan
దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం భారత్ ఇప్పటి నుంచి సమాయత్తమవుతోంది. అయితే, ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజయావకాశాలపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‍‌లో భారత జట్టు గెలవాలంటే మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీలు ఉంటేనే మెరుగైన విజయావకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు జట్టుకు అందించే స్థిరత్వం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం విలువైనవని పేర్కొన్నాడు. ప్రపంచకప్ వంటి భారీ టోర్నీల్లో అనుభవజ్ఞుల పాత్ర ఎంత ముఖ్యమో భారత్ గతంలో పలుమార్లు చూసిందని గుర్తు చేశాడు.
 
రోహిత్ శర్మ గురించి మాట్లాడిన పఠాన్, అతని షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై వేగం, బౌన్స్ ఎక్కువగా ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో రోహిత్ వంటి బ్యాటర్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగలడని అన్నాడు. బాల్ లెంగ్త్‌ను ముందుగానే అంచనా వేసి ఆడే అతని సామర్థ్యం భారత జట్టుకు పెద్ద బలమని వివరించాడు.
 
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే వన్డే క్రికెట్లో అతని స్థిరత్వానికి సాటే లేదని పఠాన్ పేర్కొన్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌‍కు వచ్చే కోహ్లి తొలి వికెట్ త్వరగా పడినప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగలడని చెప్పాడు. భారీ లక్ష్యాల ఛేదనలో కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని వివరించాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడే అతని స్వభావం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ప్రపంచకప్ గెలవాలంటే రోహిత్ దూకుడు, నిలకడ రెండూ భారత్‌‍కు తప్పనిసరిగా అవసరమని స్పష్టం చేశాడు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఎవరితోనైనా ఓడిపోవచ్చు.. కానీ పాక్ చేతిలో మాత్రం ఓడిపోకూడదు : జెమీమా రోడ్రిగ్స్