1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India wins toss and opts to bowl against West Indies in second ODI I

గౌహతి వన్డే మ్యాచ్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

cricket
cricket
పర్యాటక వెస్టిండీస్ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం గౌహతి వేదికగా రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, మంచి జోరుమీదున్న విషయం తెల్సిందే. దీంతో ఛేజింగ్‌కు ఇష్టపడిన గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
 
తొలి వన్డేలో ఘన విజయంతో జోరు మీదున్న భారత్‌.. ఇందులోనూ గెలిచి మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన నితీశ్‌ కుమార్‌రెడ్డి స్థానంలో జట్టులోకి ఆకిబ్‌ నబీ వచ్చాడు. ఈ మ్యాచ్‌తో అతడు వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు విండీస్‌ తన జట్టులో నాలుగు మార్పులు చేసింది.
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన జట్ల వివరాలను పరిశీలిస్తే, 
భారత్‌ : రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌, నమన్‌ ధీర్‌, రవీంద్ర జడేజా, ఆకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిధ్‌ కృష్ణ
 
విండీస్‌ : జాన్‌ క్యాంప్‌బెల్‌, కీస్‌ కార్టీ, షై హోప్‌, అమీర్‌ జంగూ, రూథర్‌ఫర్డ్‌, రోస్టన్‌ చేజ్‌, కీమో పాల్‌, అల్జారీ జోసెఫ్‌, షమార్‌ జోసెఫ్‌, జెడెన్‌ సీల్స్‌, విటెల్‌ లాస్‌ 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆసియా క్రీడలు : భారత్ ఖాతాలో మరో బంగారు పతకం