సంబంధిత వార్తలు
- మూడేళ్లలో ఆ మహిలపై 600 మంది అత్యాచారం చేశారు...
- కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)
- Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే
- లాహోర్‌లో మైనర్ క్రైస్తవ బాలిక కిడ్నాప్.. మతం మార్చి పెళ్లి చేసుకున్న 41 యేళ్ళ వ్యక్తి
- పాకిస్తాన్: క్రైస్తవ బాలిక కిడ్నాప్-ఇస్లాం మతంలోకి మార్పిడి, 41 ఏళ్ల ముస్లిం వ్యక్తితో వివాహం
ఎవరితోనైనా ఓడిపోవచ్చు.. కానీ పాక్ చేతిలో మాత్రం ఓడిపోకూడదు : జెమీమా రోడ్రిగ్స్
ఎవరితో మ్యాచ్‌లో అయినా ఓడిపోవచ్చు కానీ పాకిస్థాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దు అని తన బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా తనతో అన్నాడని టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా, భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతటి ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించింది. మహిళల టీ20లో భాగంగా, జూన్ 14వ తేదీ ఆదివారం పాకిస్థాన్‌తో జరుగనున్న తొలి మ్యాచ్‌కు ముందు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌తో ఇరు జట్లూ తమ ప్రపంచ కప్ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెమీమా మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల చరిత్ర, అభిమానుల అంచనాల వల్ల బయటి నుంచి ఒత్తిడి ఉంటుందన్నది వాస్తవం. దీన్ని మనం కాదనలేం అని హర్మన్ ప్రీత్ కౌర్ డ్రెస్సింగ్ రూమ్‌తో తమతో చెబుతుందని జెమీమా గుర్తుచేసుకుంది.
అయితే, ఈ ఒత్తిడిని అధిగమించి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోందని ఆమె వివరించింది. జట్టు సన్నద్ధతలో కోచ్ ఆమోల్ మజుందార్ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. 2025 వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన స్ఫూర్తితో ఆడదామని వ్యాఖ్యానించింది. ప్రతి మ్యాచ్‌కు విభిన్న వ్యూహాలతో సన్నద్ధమవుతామని వెల్లడించింది. ముఖ్యంగా, జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణించాలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నామని జెమీమా వెల్లడించింది.
