1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Lucky Escape For Gujarat Titans Players: Team Bus Catches Fire After IPL 2026 Final, All Evacuated

గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

Bus fire
Bus fire
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి మ్యాచ్ ముగించుకుని హోటల్‌కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు బస్సులో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కానీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల కెప్టెన్ శుభమన్ గిల్‌తో పాటు ఆటగాళ్లు, కోచ్‌లు సపోర్ట్ స్టాఫ్ అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లైంది. 
 
స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో బస్సులో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో బస్సులోంచి దట్టమైన పొగలు, మంటలు రావడం ప్రారంభమయ్యాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయగా.. ఆటగాళ్లందరినీ త్వరత్వరగా కిందకు దించేశారు. ఈ ఘటనలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం కారణంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు దాదాపు గంటపాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్న విరాట్ కోహ్లీ.. నిజమేనా?