బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (16:39 IST)

సాకర్ ఫీల్డులో దిగి.. ఓ గోల్ చేసిన ధోనీ..? 90 నిమిషాల పాటు..?

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత జింబాబ్వే టూరుకు వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటున్న ధోనీ మళ్లీ స్టేడియంలోకి అడుగుపెట్టాడు. అయితే, ధోనీ వచ్చింది క్రికెట్ ఆడేందుకు కాదు, నెల రోజుల విరామం అనంతరం, శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు సాకర్ ఫీల్డ్‌కు వచ్చాడు. రాంచీలో సిల్లి స్టేడియంలో జరిగిన సాకర్ మ్యాచ్‌లో ధోనీ 90 నిమిషాల పాటు బంతి వెంట పరుగులు తీశాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఓ గోల్ కూడా చేయడం విశేషం. 
 
పాతమిత్రుడు సుదేశ్ ఆహ్వానం మేరకు ఈ జార్ఖండ్ డైనమైట్ సాకర్ బరిలో దిగాడట. లెఫ్ట్ ఫ్లాంక్‌లో ఆడిన ధోనీ మొత్తమ్మీద ప్రొఫెషనల్ టచ్ ఇచ్చాడు. తనకందిన ఓ పాస్‌ను గోల్‌గా మలచి అందరినీ అలరించాడు. కాగా మామూలుగానే ఫుట్ బాల్ అంటే అమితంగా ఇష్టపడే ధోనీ, టీమిండియా మ్యాచ్ సన్నాహాల్లోనూ సాకర్‌ను భాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. హాలీడేస్‌ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేశానని చెప్పాడు. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని తెలిపాడు.