మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (15:19 IST)

వెల్లింగ్టన్ వన్డే.. బౌన్సర్‌‌తో మిచెల్ మెక్ క్లాన్‌కు గాయం.. కంటిచుట్టూ ఎముకలు..?

వెల్లింగ్టన్‌లో పాకిస్థాన్- కివీస్‌ల మధ్య జరుగుతున్న వన్డే పోరుకు మిచెల్ మెక్ క్లాన్ గాయానికి పాలవడం అంతరాయం కలిగించింది. పాక్ ఫాస్ట్ బౌలర్ అన్వర్ అలీ వేసిన బంతికి కివీస్ ప్లేయర్ మిచెల్ మెక్ క్లాన్ గన్ మైదానంలో కుప్పకూలిపోవడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అన్వర్ వేసిన బౌన్సర్ హెల్మెట్‌ను దాటి మరీ ఎడమ కన్నుకు బలంగా తాకడంతో మిచెల్‌కు రక్తస్రావం కావడంతో పాటు మైదానంలో కిందపడి విలవిల్లాడాడు. 
 
వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు మిచెల్‌ను ఆసుపత్రికి తరలించారు. కంటి చుట్టూ ఉన్న ఎముకలు విరిగాయని వైద్యులు నిర్ధారించారు. గాయానికి కుట్లు వేశామని చెప్పారు. కంటి ఎముక విరగడంతో, ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి వుందని వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన మిచెల్ తాను క్షేమంగా ఉన్నానని, పెద్ద ప్రమాదం లేదని ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. తన తాజా చిత్రాన్ని తీసి పోస్ట్ చేశాడు.