1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Pakistan axe 7 players in major shake-up after England Test series humiliation

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ - ఏడుగురు ఆటగాళ్ళపై వేటు

pakistan cricket team
ఇంగ్లండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుడుతూ, ఏకంగా ఏడుగురు ఆటగాళ్ళపై వేటు వేసింది. 
 
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు 194 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ మధ్యలోనే సమూల మార్పులు చేపడుతూ ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించింది. అలాగే, రెడ్-బాల్ కోచింగ్ సిబ్బందిపై కూడా వేటు వేసింది.
 
వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, పరిమిత ఓవర్ల క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, ముహమ్మద్ అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్లను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. 
 
వీరి స్థానంలో ఏడుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరిలో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్లకు టెస్ట్ అనుభవం ఉండగా, అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్, రజావుల్లాలకు తొలిసారిగా టెస్ట్ జట్టులో చోటు లభించింది.
 
ఆటగాళ్లపైనే కాకుండా కోచింగ్ సిబ్బందిలోనూ మార్పులు చేసింది. టెస్ట్ క్రికెట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. వారి స్థానంలో ఈ పర్యటన ముగిసే వరకు వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్, యాష్‌లే నోఫ్కేలకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ ఇప్పటికే 0-2తో వెనుకబడగా.. ఆటగాళ్ల పేలవ ఫామ్, గాయాల వివాదాలే ఈ మార్పులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కాగా, ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.  
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కేరళకు లియోనల్ మెస్సీ.. కోట్లాది రూపాయల ఆర్థిక అవతవకలు.. సిట్ ఏర్పాటు