1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Pakistan Captain Fatima Sana Angry Over Teammate Aaliya Riaz's Husband Staying In Her Room At Women's T20 World Cup: Report

గదిలో భర్తతో పాకిస్థాన్ సీనియర్ మహిళా క్రికెటర్ - పాక్ మహిళా క్రికెట్ జట్టులో రచ్చ

pak women cricketer
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు మరోమారు వెలుగు చూశాయి. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుసగా ఓడిపోతోంది. దీంతో ఆ జట్టులో అంతర్గత విభేదాలతో పాటు గొడవలు తారాస్థాయికి చేరినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ - కోచ్ మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఈ ఆరోపణలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు జట్టులోని గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.
 
జట్టు మెంటార్ వహాబ్ రియాజ్‌కు, కెప్టెన్ ఫాతిమా సనాకు మధ్య సెలక్షన్ విషయాల్లో తీవ్రమైన భేదాభిప్రాయాలు తలెత్తిన్నట్లు సమాచారం. బంగ్లాదేశీ మ్యాచ్‌కు ముందు ఈ వివాదం మరింత ముదిరింది. సీనియర్ ప్లేయర్ ఆలియా రియాజ్ భర్త, ఆమెతో పాటు టీమ్ హోటల్ గదిలో ఉండటాన్ని కెప్టెన్ ఫాతిమా సనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పట్టుబట్టడంతో ఆలియా భర్త అలీ యూనిస్‌ను గది ఖాళీ చేయమని యాజమాన్యం కోరింది. అయితే, దీని తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు, జట్టు ప్రాక్టీస్ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆలియా, ఆమె భర్త సరదాగా షికారుకు వెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది.
 
దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆలియాను బంగ్లాదేశ్ మ్యాచ్ నుంచి తప్పించాలని ఫాతిమా పట్టుబట్టింది. అయితే, మెంటార్ వహాబ్ రియాజ్ మాత్రం ఆమెను తుది జట్టులో కొనసాగించాలని పట్టుబట్టారు. చివరికి వహాబ్ మాటే నెగ్గింది. కానీ, ఆ మ్యాచ్‌లో ఆలియా విఫలమవగా, పాకిస్థాన్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం అందరి ముందే ఫాతిమా సనా.. వహాబ్‌ను నిలదీసింది. క్రమశిక్షణ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఓటమి ఎదురైందని, దీనికి మీరే బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హార్దిక్ పాండ్యా, మహికాలకు పెళ్లైపోయిందా? ఆ సింధూరం మిస్టరీ ఏంటి?