బుధవారం, 3 డిశెంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (09:43 IST)

ఆసియా కప్ : పాక్ వికెట్లు యుద్ధ విమానాల్లా కుప్పకూలిపోయాయి : పాక్ ఫ్యాన్స్

pakistan cricket team
ఆసియా కప్ టోర్నీ భారత్ పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లలో పాకిస్థాన్‌కు శృంగభంగం తప్పలేదు. మ్యాచ్‌లకు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ జట్టు చివరికి ఆసియా కప్‌ను కోల్పోయింది. దీంతో సొంత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆగ్రహాన్ని నెట్టింట ట్రోల్స్ రూపంలో పెడుతున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ మరోమారు చిత్తుగా ఓడించిన విషయం తెల్సిందే. 
 
ఈ ఓటమితో అభిమానులు నిరాశలో కూరుకునిపోయారు. మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌‍గా ఉన్న పీసీబీ చైర్మన్ నఖ్వీ నుంచి టైటిల్‌ను అందుకునేందుకు భారత్ ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఆ కప్‌ను ఆయనే తీసుకెళ్లారు. ఇది పాకిస్థాన్‌కు మరింత తలవంపులు తెచ్చింది. దీంతో నెట్టంట పాక్ జనాలు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
భారత్‌పై నెగ్గాలని పాక్ ఎంతగా తపించినా సాధ్యంకాదు.. ఎందుకంటే వాళ్ళు మనకు బాబులాంటోళ్ళు అని ఓ పాక్ అభిమాని నిర్వేదం వ్యక్తం చేశారు. భారత్‌పై విజయం ఈ తరంలో చూస్తామో లేదో తెలియడం లేదు అని, వాళ్ల కాళ్ల గోటికి కూడా మనం సమానం కాదు.. మనతో చేతులు కలపకుండా భారత ఆటగాళ్లు మంచి పనే చేశారు అంటూ మరో వ్యక్తి అన్నారు. 
 
భారత జట్టును ఎదుర్కొన్నపుడల్లా పాక్ తత్తరపాటుకు లోనుకావడం అలవాటే. ఆరంభంలో బాగానే మ్యాచ్‌ను ప్రారంభించినా ఆ తర్వాత మనం వికెట్లను యుద్ధ విమానాల్లా కుప్పకూలిపోతాయి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా రకరకాలైన కామెంట్స్ ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.