1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Red alert hangs over IPL Qualifier 2 in New Chandigarh: IMD warns of heavy rain, storm between 4 and 9 pm

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు

ipl2026 season
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. ఫైనల్ బెర్తు కోసం శుక్రవారం చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. చండీగఢ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 
 
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చండీగఢ్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఉదయం పూట వాతావరణం నిర్మలంగా ఉన్నప్పటికీ సమీపంలోని హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రభావం చండీగఢ్‌పై కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే, ఐపీఎల్  నిబంధనల ప్రకారం లీగ్ మ్యాచ్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అపుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఒక వేళ మ్యాచ్‌ జరిగితే ఇందులో గెలిచే జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడుతుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఐపీఎల్ మ్యాచ్‌లకు కఠిన నిబంధనలు.. స్మార్ట్ సన్ గ్లాసెస్ ధరించడంపై నిషేధం