సంబంధిత వార్తలు
- 'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..
- ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమే.. మగాళ్ళు లింగ మార్పిడి చేయించుకున్నారా... ఏంటి? ఎలాన్ మస్క్
- మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్
- CMOtamilnadu : 24 గంటల్లో 10 లక్షలు పెరిగిన ఇన్‌స్టా ఫాలోయర్లు
- ఉమ్మెత్త పువ్వులతో కూర వండుకుని తిని నలుగురి పరిస్థితి విషమం.. ఎక్కడ?
చాహల్‌తో డేటింగ్ చేయడం లేదు.. జస్ట్ ఫ్రెండ్ మాత్రమే : ఆర్జే మహ్వాష్
భారత క్రికెట్ జట్టు క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి నటి, ఆర్జే మహ్వాష్ ఫుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేశారు. చాహల్‌తో తాను డేటింగ్ చేయడం లేదని మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అన్నారు. అయితే, తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి నిజం లేదన్నారు. చాహల్ కష్టకాలంలో ఉన్నపుడు తామంతా అతినికి స్నేహితులుగా అండగా నిలిచామని ఆమె వెల్లడించారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు చాలా చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి హైప్ చేస్తుంటారు. ఇది అంత పెద్ది విషయం కాదు అని అన్నారు. స్నేహితుల మధ్య సాధారణంగా జరిగే చిన్న గొడవ కారణంగా ఇన్‌స్టాను ఒకరినొకరు అన్ ఫాలో చేసుకుంటే దానిని కూడా పెద్దదిగా చూశారని ఆమె వివరించారు.
అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నపుడు మేమంతా అతనికి అండగా నిలిచాం. ఆ సమయంలో అతనికి ఒక మంచి ఫ్రెండ్ అవసరం. స్నేహానికి నేను చాలా విలువనిస్తాను అని మహ్వాష్ తెలిపారు. చాహల్‌కు తన విషెస్ ఎల్లవేళలా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
