సోమవారం, 9 మార్చి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (22:32 IST)

Finn Allen: అలెన్ సూపర్ ఇన్నింగ్స్.. 33 బంతుల్లో ఫాస్ట్ సెంచరీ.. నేరుగా ఫైనల్లోకి కివీస్ (video)

Finn Allen
Finn Allen
ప్రపంచ కప్ ట్వంటీ-20లో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 12.5 ఓవర్లకే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుని నేరుగా ఫైనల్ పోరుకు సై అంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. క్రికెట్ ఫ్యాన్సుకు బిగ్ ట్రీట్ ఇచ్చాడు. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ ఇచ్చేలా ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. 
 
అలెన్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా సఫారీ జట్టు మరోసారి నాకౌట్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. అలెన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 173 పరుగులు చేసి ఛేదించింది. న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ (58) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 
 
ముఖ్యంగా అలెన్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 9.1 ఓవర్లలోనే 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. సీఫర్ట్ ఔటయ్యాక వచ్చిన రచిన్ రవీంద్ర (13 నాటౌట్)తో కలిసి అలెన్ మరో వికెట్ పడకుండా 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. 
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) డివాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) రాణించడంతో సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకుంది. 
 
మ్యాచ్ రికార్డులు 
ఫిన్ అలెన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని 33 బంతుల్లోనే చేధించాడు.
గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (47 బంతులు) పేరిట ఉండేది. 
టెస్టు హోదా ఉన్న దేశంపై టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
అంతర్జాతీయ టీ20ల్లో ఇది సంయుక్తంగా మూడో అత్యంత వేగవంతమైన శతకం. 
టెస్టు హోదా ఉన్న జట్ల బ్యాటర్లలో సికందర్ రజా (జింబాబ్వే)తో కలిసి అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేశాడు.