సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2026 : గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. బోరున విలిపించిన వైభవ్
- ఐపీఎల్ 2026 సీజన్లో సరికొత్త రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
- Kavya Maran: జట్టు ఓడిందని కావ్య కన్నీళ్లు.. అయినా వైభవ్ సూర్యవంశీకి అభినందనలు
- Vaibhav Sooryavanshi: సెంచరీలు వస్తుంటాయ్.. కానీ ఐపీఎల్ ట్రోఫీపైనే దృష్టి: వైభవ్
- Vaibhav Sooryavanshi: త్రైపాక్షిక సిరీస్ జట్టు విడుదల... వైభవ్ సూర్యవంశికి చోటు
ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసే గేమ్ ఛేంజర్ : సచిన్ టెండూల్కర్
ఐపీఎల్ 2026 సీజన్ యావత్ మొత్తం మార్మోగిపోయిన పేరు వైభవ్ సూర్యవంశీ. ఈ మైనర్ క్రికెటర్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ కేవలం పరుగులు చేసే ఆటగాడు మాత్రమే కాదు.. ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీస్తూ, తన జట్టులో స్ఫూర్తిని నింపే ఒక గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై రెడిట్‌లో సచిన్ పోస్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీ కేవలం తాను చేసిన పరుగులతోనే కాదు. అంతకుమించి ఆటపై తనదైనముద్ర వేశాడు. అతను క్రీజులోకి రాకముందే ప్రత్యర్థి జట్లు అతని గురించి తీవ్రంగా ఆలోచించేవి. అతని కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించేవి. అభిమానులు అతని బ్యాటింగ్ కోసమే ఎదురుచూసేవారు అని అన్నారు.
ఎలిమినేటర్, క్వాలిఫయర్ వంటి అత్యంత కీలకమైన, ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో అతని దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఇది ఒత్తిడి పెరిగినా అతని ఆటతీరు మారదని నిరూపించింది. అన్నిటికంటే ముఖ్యంగా అతను బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక అదనపు నమ్మకాన్ని నింపినట్టు కనిపించింది అని వివరించారు.
కాగా, ఐపీఎల్ 2026లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిగన సూర్యవంశీ ఏకంగా 776పరుగులు సాధించాడు. ఎంతో మంది అంతర్జాతీయ స్టార్ బ్యాటర్లన్న ఈ లీగ్‌లో 750 పరుగుల మార్క్‌ను దాటిన ఏకైక ఆటగాడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతని బ్యాటింగ్ ఎంత వినోదాన్ని పంచిందో, అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థులకు విధ్వంసాన్ని సృష్టించింది. ఈ యువ కెరటం ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు.
