1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Shreyas Iyer Breaks MS Dhoni's Unique Record, Becomes 1st T20I Captain To Do So

ధోనీ పేరిట వున్న రికార్డును బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer
Shreyas Iyer
భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఇంకా వరుసగా శ్రేయాస్ అయ్యర్ ఎనిమిది సార్లు టాస్ గెలవడం విశేషంగా మారింది.

ఇప్పటి వరకు ఈ రికార్డు బహామాస్‌కు చెందిన కెప్టెన్ గ్రెగరీ టేలర్ పేరిట ఉండేది. ఆయన వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ ఆ రికార్డును అధిగమించి వరుసగా ఎనిమిది టాస్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ వ్యక్తిగతంగా అరుదైన రికార్డు సాధించినా, జట్టు ప్రదర్శనను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
భారతీయ కెప్టెన్ల విషయానికొస్తే, టీ-20లలో వరుసగా అత్యధిక సార్లు టాస్ గెలిచిన రికార్డు గతంలో ఎం.ఎస్. ధోనీ పేరిట ఉండేది. ధోనీ 2010 మే, 2012 ఫిబ్రవరి మధ్య భారత టీ20 కెప్టెన్‌గా వరుసగా ఏడు సార్లు టాస్ గెలిచారు. ఈ విజయం తర్వాత, జట్టు ప్రదర్శనను అయ్యర్ ప్రశంసించారు; కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేయడం ఒక ప్రత్యేకమైన క్షణమని ఆయన పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
2026 కామన్వెల్త్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న ముగ్గురు క్రీడాకారులు