1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Smriti Mandhana Only Indian in TIME’s 100 Most Influential Sportspersons List

Smriti Mandhana: స్మృతి మంధానకు టైమ్ మ్యాగజైన్‌లో చోటు

smriti mandhana
క్రీడా రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో క్రికెటర్ స్మృతి మంధానకు టైమ్ మ్యాగజైన్ చోటు కల్పించింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయురాలు ఆమె కావడం విశేషం. నేడు క్రీడా రంగాన్ని తీర్చిదిద్దుతున్న క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతిపాదకులు, పెట్టుబడిదారులతో టైమ్ రూపొందించిన ఈ జాబితాలో అమెరికన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. 
 
అలాగే, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, చైనీస్-అమెరికన్ స్కీయర్ ఐలీన్ గు, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు విక్టర్ వెంబన్యామా, గోల్ఫ్ దిగ్గజం రోరీ మెక్‌ఇల్‌రోయ్ వంటి క్రీడా ప్రపంచంలోని ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 
 
ఈ జాబితాలోని ఇతర ప్రముఖులలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో, దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బావుమా, న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు జాలెన్ బ్రన్సన్, ఫిఫా ధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో ఉన్నారు. ఇందులో భారత మహిళల జాతీయ జట్టు వైస్ కెప్టెన్ అయిన 29 ఏళ్ల స్మృతి మంధాన ఈ విశిష్ట జాబితాలో చోటు దక్కించుకున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
FIFA World Cup: లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ రికార్డ్.. క్లోస్ రికార్డ్ సమం (video)