సంబంధిత వార్తలు
- టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ... యావత్ భారతదేశ విజయం : సూర్యకుమార్ యాదవ్
- కివీస్ ఉంచిన 154 పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలో ఊదేశారు...
- క్రికెటర్లు వెంట పడుతున్నారు.. వారితో డేటింగ్ చేయడం ఇష్టంలేదు : ఖుషీ ముఖర్జీ
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను అతిగా హైప్ చేయడం ఆపాలి- సూర్య కుమార్ యాదవ్
- భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య పస తగ్గిపోయింది.. కెప్టెన్ సూర్యకుమార్
భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌కు ఉద్వాసన?
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది. ఇపుడు సూర్యకుమార్ ఫామ్ అతనికి సారథ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. గురువారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆన్‌లైన్ ద్వారా అత్యవసర అపెక్స్ కౌన్సిల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది.
అయితే, ఈ భేటీలో భారత పురుషుల టీ20 తదుపరి కెప్టెన్సీ అంశాన్ని అధికారికంగా చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. రాబోయే రెండేళ్ల ప్రణాళికలతో పాటు 2028లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోయే టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.
2024లో రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత సూర్య కుమార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ, గత కొంతకాలంగా సూర్య కుమార్ యాదవ్ ఎదుర్కొంటున్న సుదీర్ఘ ఫామ్ లేమి ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజనులో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సూర్య... 13 ఇన్నింగ్స్‌లో కేవలం 20.76 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి వైఫల్యం వల్ల ఐపీఎల్‌లో ముంబై 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ, అలాగే ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లోనూ సూర్య బ్యాట్‌తో ఘోరంగా తడబడ్డాడు.
