సంబంధిత వార్తలు
- వైభవ్ సూర్యవంశీ.. భారత జట్టుకు అతిపెద్ద ఖజానా : డేల్ స్టెయిన్
- 2026 ఆసియా క్రీడలు.. బీసీసీఐ ప్రకటించిన జట్టులో సూర్యవంశీకి చోటు
- ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసే గేమ్ ఛేంజర్ : సచిన్ టెండూల్కర్
- ఐపీఎల్ 2026 : గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. బోరున విలిపించిన వైభవ్
- ఐపీఎల్ 2026 సీజన్లో సరికొత్త రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఏంటది?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరుగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే, వయసు రీత్యా వైభవ్ ఇంకా చిన్నపిల్లవాడు కావడంతో ఈ విదేశీ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్లడానికి బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
ఇదే అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, వైభవ్ ఇప్పుడే పాఠశాల చదువు పూర్తి చేసుకుని వచ్చాడని, అంతర్జాతీయ క్రికెట్ వాతావరణానికి అలవాటు పడటానికి అతడికి కుటుంబ సభ్యుల మానసిక అని పేర్కొన్నాడు. అందువల్ల అతడి తల్లిదండ్రుల ప్రయాణ, వసతి, ఇతర అన్ని రకాల ఖర్చులను బోర్డే పూర్తిగా భరిస్తుందని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకుని, కొత్త వాతావరణంలో వైభవ్ సులభంగా సెట్ అవ్వడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని బోర్డు భావిస్తోంది. కొడుకు ఎదుగుదలకు తల్లిదండ్రులు అందిస్తున్న మద్దతును సైకియా అభినందించారు.
భారత జట్టు ఈ జూన్ చివరి వారంలో ఐర్లాండ్ జట్టు రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత జులైలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. గతంలో అండర్-19 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ, దశాబ్దాల కాలంలో సీనియర్ భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ వైట్ బాల్ సిరీస్‌లో వైభవ్‌కు మంచి అవకాశం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇటీవల స్వదేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో వైభవ్ ఏకంగా 776 పరుగులు చేసిన విషయం తెల్సిందే.
