1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Vaibhav Sooryavanshi smashes fastest list A fifty in history, scores 94 off 29 balls against Sri Lanka A

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌... 29 బంతుల్లో 94 పరుగులు

Vaibhav Suryavanshi
భారత యువ క్రికెట్ సంచలనం, కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. దంబుల్లా వేదికగా శ్రీలంక ఎ జట్టుతో జరుగుతున్న ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్ పోరులో వైభవ్ మెరిశాడు. టాస్ గెలిచి భారత్ ఎ తరపున బరిలోకి దిగిన వైభవ్.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సహాయంతో 94 పరుగులు రాబట్టాడు. అంటే కేవలం బౌండరీల రూపంలోనే ఏకంగా 88 పరుగులు సాధించాడు. 
 
లంక ప్రధాన బౌలర్ మొహమ్మద్ షిరాజ్ వేసిన ఒకే ఓవర్‌లో వైభవ్ వరుస బౌండరీలతో విరుచుకుపడి ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ వైపు దూసుకెళ్తున్న వైభవ్.. దురదృష్టవశాత్తూ శతకానికి కేవలం ఆరు పరుగుల దూరంలో (94 పరుగుల వద్ద) శ్రీలంక కెప్టెన్ సహాన్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ, వైభవ్ ఆటతీరుతో అదరగొట్టాడు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ ఫైనల్‌.. విజేతగా నిలిచిన భారత జట్టు