1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Vaibhav the Cricketer, Who Demands Money If I Want to Give a Photo

ఇద్దరు అబ్బాయిల వద్ద సెల్ఫీకి వంద రూపాయలు అడిగిన వైభవ్ సూర్యవంశీ (video)

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi
యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఛండీగర్ ఎయిర్ పోర్టులో ఇద్దరు అబ్బాయిలను ఆటపట్టించాడు. వైభవ్‌ను ఒక్కసారి చూడాలనే ఆశతో పిల్లలు ఛత్తీస్‌గఢ్ విమానాశ్రయం వద్ద గుమిగూడారు. తనతో సెల్ఫీ ఫోటో కావాలంటే వంద రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. 
 
ఇంకా ఆ ఇద్దరు చిన్నారుల వద్ద ఎంత డబ్బు వుందో చెప్పండి అంటూ అడిగాడు. దీంతో ఛత్తీస్‌గఢ్ విమానాశ్రయంలో వైభవ్‌ను చూడటానికి వచ్చిన పిల్లలు రెండు వందలు ఇస్తామి సెల్ఫీ కావాలని అన్నారు.
 
"సెల్ఫీ కావాలంటే మీరు రూ.100 ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా?" అంటూ ఆ పిల్లలను ఆటపట్టించాడు. కాసేపటికి ఇదంతా ప్రాంక్ అంటూ అసలు విషయం చెప్పాడు. తర్వాత వైభవ్ వారితో కలిసి సంతోషంగా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Gandhi Kotari: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టెన్‌పిన్ బౌలింగ్... విజేతగా గాంధీ కోటారి