1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Vijay Devarakonda is the brand ambassador of TG20 Cricket League

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

Vijaydevarakonda at Stadium
తెలంగాణ రాష్ట్రంలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా టీజీ20 లీగ్ పేరుతో ఓ క్రికెట్ టోర్నీని నిర్వహించనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ ఎంపికైంది. లీగ్ ఆరంభానికి సమయం దగ్గరపడటంతో అభిమానులను ఆకర్షించడానికి హెచ్‌సీఏ, ఫ్రాంఛైజీలు ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నాయి. 
 
బుధవారం ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల నెక్లెస్‌ రోడ్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్‌ డిస్‌ప్లే షోలో జట్ల లోగోలను నిర్వాహకులు ప్రదర్శించారు. లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతుండగా.. ప్రతి జట్టు మిగతా అన్ని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనున్నాయి. జూన్ 23న పాలమూరుతో జరిగే మ్యాచ్‌తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తలపడనుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Smriti Mandhana: స్మృతి మంధానకు టైమ్ మ్యాగజైన్‌లో చోటు