సంబంధిత వార్తలు
- బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'
- సంజు శాంసన్.. ఓ ఛేజింగ్ మాస్టర్ : పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ
- Chiranjeevi: ఓటీటీలో రికార్డు సృష్టించిన మన శంకర వర ప్రసాద్ గారు
- దుబాయ్, రెడీ ఫర్ ఎ సర్ప్రైజ్: అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల శీతాకాలపు ప్రయాణం
- విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మలకు షాకివ్వనున్న బీసీసీఐ
ఐపీఎల్ సీజన్‌లో అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీ
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా అవతరించాడు. ఛేదనలో 4 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ సీజన్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు విజయభేరీ మోగించింది. 202 పరుగుల విజయలక్ష్య ఛేదనలో కోహ్లీ 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఛేదనలో 4వేలకుపైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను కోహ్లీ అధిగమించాడు. మాలిక్ 557 మ్యాచుల్లో 13,571 పరుగులు చేయగా.. విరాట్ 415 మ్యాచుల్లోనే 13,612 పరుగులు సాధించాడు.
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి రావాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలని సూచించాడు. సన్‌రైజర్స్‌పై 69 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే, ఐపీఎల్‌లో అతడి నుంచి అత్యుత్తమ ఆట ఇంకా రాలేదని అభిప్రాయపడ్డాడు.
