అందమైన రోజున అత్యంత అందమైన మహిళతో విరాట్... నాన్నతో సైనా 10కె తీస్తూ...
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ అనుష్క శర్మను వదిలించుకున్నాక విరాట్ కోహ్లిక్ ప్రపంచం అంతా అందంగా కనబడుతోంది. నిన్న రాత్రి ట్విట్టర్లో ఓ పోస్టు చేశాడు.
అదేమిటంటే... ఈ అందమైన రోజునాడు అత్యంత అందమైన మహిళతో నేను. నా శక్తి, నా సంతోషం, నా సర్వస్వం మై మమ్మీ అంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి ట్వీట్లు గతంలో ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదు మరి. మొత్తమ్మీద అనుష్కను వదిలేశాక ప్రపంచం కొత్తకొత్తగా ఉందన్నమాట.
ఇకపోతే మరో క్రీడాకారిణి సైనా నెహ్వాన్ తన తండ్రితో 10కె నడక చాలా ఉత్సాహంగా ఉందంటూ ట్విట్టర్లో నాన్నతో కలిసి ఓ ఫోటో ట్వీట్ చేశారు.