సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ
- ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం
- ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం - మరోవైపు క్షిపణిదాడులు
- రెండో వారంలో అడుగుపెట్టిన ప్రాంతీయ యుద్ధం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం
- ఇదీ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అంటే... లెక్కలేసి మరీ నిర్భయంగా ఆడాడు... సంజూపై పాక్ ఫ్యాన్స్ ప్రశంసలు
ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీ20 వరల్డ్ చాంపియన్ భారత్
క్రికెట్ పసికూన ఐర్లాండ్ జట్టు చేతిలో టీ20 వరల్డ్ కప్ చాంపియన్ భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ టూర్‌లో సిరీస్‌ను ఏకంగా 0-2 తేడాతో ఓడిపోయింది. ఇది ఇపుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఓటమి నేపథ్యంలో 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఈ చర్చపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డచ్ కేట్ స్పందించాడు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాడని, అయితే జట్టులోకి రావాలంటే మిగతా ఆటగాళ్లలాగే ఓ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.
ఐర్లాండ్ ఆదివారం జరిగిన రెండో టీ20లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైన అనంతరం డచ్ కేట్ మీడియాతో మాట్లాడాడు. వైభవ్ ఎంపిక గురించి ప్రశ్నించగా.. "అతను అంతర్జాతీయ క్రికెట్‌కు సంసిద్ధంగా ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మూడు నెలల క్రితం మనం ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో కూడా అతను బాగా రాణించాడు.
జట్టులోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం, వారికి సుదీర్ఘ అవకాశాలు ఇవ్వడం మా విధానం. అందరిలాగే మేం కూడా వైభవ్‌ను ఆడించాలని ఉత్సాహంగా ఉన్నాం. కానీ, అతను కూడా అదే ప్రక్రియను దాటుకుని రావాలి. అతని ప్రతిభపై మాకు ఎలాంటి సందేహాలు లేవు అని వివరించాడు. సిరీస్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ కోచ్ సితాను కోటక్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 230కి పైగా స్ట్రైక్ రేట్ ఏకంగా 776 పరుగులు సాధించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేగాక 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. ఇంతటి అద్భుత ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడంపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
