అక్తర్‌కి కొత్త కాంట్రాక్టా..? నో ఛాన్స్..!: ఇజాజ్ భట్

SELVI.M|
FILE
పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ స్పష్టం చేశారు. కేటగిరీ "ఏ" కింద ఉన్న అక్తర్ ప్రస్తుత కాంట్రాక్ట్ ఈ నెలాఖరుతో ముగియనుంది.

ఈ నేపథ్యంలో జాతీయ, దేశవాళీ జట్లలో అక్తర్ ఆడటం లేదు కాబట్టి అతనికి కొత్త కాంట్రాక్ట్‌ను ఇచ్చే అవకాశం లేదని భట్ తేల్చి చెప్పేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న.. దేశవాళీ మ్యాచ్‌లో ఆడుతున్న వారికి మాత్రమే నెలనెల జీతాలు, కాంట్రాక్టులు ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి అక్తర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు.

ఇదిలా ఉంటే.. పాక్ పేసర్ సోహైల్ తన్వీర్‌కు మంచి అవకాశం లభించింది. ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు విక్టోరియా బుష్ రేంజర్స్ తరపున తన్వీర్ ఆడనున్నాడు. ఈ నెల చివరిలో జరిగే ప్రతిష్టాత్మక టి20 బిగ్‌బాష్ టోర్నీలో తన్వీర్, స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ స్థానంలో పాల్గొంటాడని జట్టు కోచ్ గ్రెగ్ షిపర్డ్ తెలిపారు.


దీనిపై మరింత చదవండి :