అమిత్ మిశ్రా.. ఇకనైనా జాగ్రత్తగా మసలుకో: అంపైర్

SELVI.M|
ఛాంపియన్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడిన అమిత్ మిశ్రా ఇకపై జాగ్రత్తగా మసలుకోవాలని అంపైర్లు హెచ్చరించారు.

ప్రత్యర్థి జట్టుకు చెందిన క్రికెటర్‌ని పెవిలియన్ ముఖం పట్టాల్సిందిగా అమిత్ మిశ్రా ఆవేశంతో చేష్టలు చేశాడు. శుక్రవారం విక్టోరియా-ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మధ్య జరిగిన పోరులో.. డేర్ డెవిల్స్ బౌలర్లను.. విక్టోరియా బ్యాట్స్‌మెన్లు ఆడుకున్నారు.

ఇందులో భాగంగా.. విక్టోరియా ఓపెనర్ రాబ్ కువినిని బోల్డ్ చేసిన మిశ్రా పెవిలియన్ వైపు వెళ్లాల్సిందిగా.. ఆక్రోశంతో చేయెత్తిచూపాడు. దీంతో అంపైర్ అయిన రోషాన్ డేర్ డెవిల్స్ ఆటగాడు మిశ్రాను హెచ్చరించారు.

ఇదిలా ఉంటే... వీరేంద్ర సెహ్వాగ్, దిల్షాన్, గౌతమ్ గంభీర్, ఓవైస్ షా వంటి అగ్రశ్రేణి క్రికెటర్లున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు.. ఆస్ట్రేలియా విక్టోరియా టీం చేతిలో చిత్తుగా ఓడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్‌పై 7 వికెట్ల తేడాతో విక్టోరియా జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.


దీనిపై మరింత చదవండి :