ఐపీఎల్4: రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు

Hanumantha Reddy|
రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ ఉంచిన 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాయల్స్ ఓపెనర్లు రాహుల్ ద్రవిడ్, షేన్ వాట్సన్‌లు 86 పరుగుల శుభారంభాన్ని ఇచ్చారు. షేన్ వాట్సన్ 32 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరగగా, ద్రవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 66 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరు ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ కొనసాగించక పోవటంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.

చెన్నై జట్టులో ఓపెనర్ మురళీ విజయ్ త్వరగా వెనుదిరిగినప్పటికీ హాస్సీ(79 నాటౌట్), సురేష్ రైనా(61)లు ధాటిగా బ్యాటింగ్ చేయటంతో లక్ష్యాన్ని సులువుగా సాధించింది.


దీనిపై మరింత చదవండి :