ఐసీసీ "హాల్ ఆఫ్ ఫేమ్‌"లో యాషెస్ హీరోలకు చోటు

PNR| Last Modified శుక్రవారం, 10 జులై 2009 (16:07 IST)
ముగ్గురు క్రికెట్ దిగ్గజాలు, యాషెస్ హీరోలకు క్రికెట్ "హాల్ ఆఫ్ ఫేమ్‌"లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చోటు కల్పించింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న యాషెస్ హీరోలలో ఇంగ్లండ్‌కు చెందిన టామ్ గ్రావెనీ, పీటర్ మే, ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ ఛాపెల్‌కు ఉన్నారు.

ప్రస్తుతం కార్డిఫ్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ట్రీ బ్రేక్ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ముగ్గురు క్రికెటర్లు ఐసీసీ "గౌరవార్థ క్యాప్‌"ను ఐసీసీ అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీబీ ఛైర్మన్, ఐసీసీ డైరక్టర్ గిలీస్ క్లార్క్‌తో పాటు.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, క్రికెట్ ఆస్ట్రేలియా డైరక్టర్ ఆలెన్ బోర్డర్‌లు పాల్గొన్నట్టు ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

"హాల్ ఆఫ్ ఫేమ్‌"లో మొత్తం ప్రాథమిక సభ్యుల సంఖ్య 55 కాగా, వీరిలో ఇంగ్లండ్ మాజీలు 22 మంది, 13 మంది ఆసీస్ క్రికెటర్లు ఉండటం గమనార్హం. కాగా, 'హాల్ ఆఫ్ ఫేం'ను ఐసీసీ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసింది. మొత్తం 79 టెస్టులు ఆడిన గ్రావెనీ 44.83 సగటుతో 4882 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు ఉన్నాయి.


దీనిపై మరింత చదవండి :