డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ గ్రీన్‌సిగ్నల్

Phani|
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా డే/నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి వచ్చిన ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు బీసీబీ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.

అయితే ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమతి పొందాల్సివుంది. ఇది కూడా సాధ్యమయితే.. చరిత్రలో ఇదే తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్ కానుంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ బోర్డు కోచ్ జేమీ సిడన్స్ కాంట్రాక్టును 2011 ప్రపంచకప్ వరకు పొడిగించింది.

ఆస్ట్రేలియాకు చెందిన సిడన్స్ నవంబరు 2007లో అదే దేశానికి చెందిన డేవ్ వాట్‌మోర్ నుంచి బంగ్లాదేశ్ కోచ్ పగ్గాలు చేపట్టారు. మరోవైపు పేస్‌బౌలర్ ముష్రాఫే మొర్తజా, ఆల్‌రౌండర్ షాకీబల్ హసన్‌లు కెప్టెన్సీ, వైస్‌‍కెప్టెన్సీలను నిలబెట్టుకున్నారు. జింబాబ్వేతో అక్టోబరులో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు వీరిద్దరూ నేతృత్వం వహించనున్నారు.


దీనిపై మరింత చదవండి :