ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌పై పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇమ్రాన్ ఫర్హత్ ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్ల విధానానికి అనుసరించి ఆడగల సత్తా పాంటింగ్‌కు ఉందని ఫర్హత్ ప్రశంసించాడు. ఇంకా రికీ పాంటింగ్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని ఇమ్రాన్ కొనియాడాడు. తన క్రికెట్ కెరీర్లో అత్యధిక రికార్డులు బ్రేక్ చేసిన రికీ పాంటింగ్.. మైదానంలో బ్యాటింగ్‌లో ఆడుకుంటాడని ఫర్హత్ తెలిపాడు.