బాధోపశమన సూదులు వాడనున్న పీటర్సన్

FileFILE
వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ యువ క్రికెటర్, మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ (బాధ ఉపశమన సూదులు)ను వాడనున్నాడు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో క్షణం తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న పీటర్సన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

ఈ నొప్పి బాధ నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడు. జులై ఎనిమిదో తేదీ నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ ఆరంభంకానుంది.

PNR|
కాగా, నొప్పి నుంచి కోలుకునేందుకు పీటర్సన్‌కు కొన్ని నెలల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ, బిజీ షెడ్యూల్ ఉన్నందుకు నెలల తరబడి విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో కేపీ లేడు. దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఈ ఇంజెక్షన్స్‌ను తీసుకోవాలని నిర్ణయించాడు.


దీనిపై మరింత చదవండి :