భారత వీసా పొందిన పాకిస్థాన్ సంతతి ఖవాజా

Hanumantha Reddy|
సెప్టెంబర్‌లో జరిగే ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌కు గానూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాకు బుధవారం భారత వీసా లభించింది. పాకిస్థాన్‌లో జన్మించిన కారణంగా ఖవాజా‌కు వీసా ఇవ్వడం ఆలస్యం అయింది.

భారత హైకమీషన్ నుంచి ఈ 24 ఏళ్ల ఖవాజాకు క్లియరెన్స్ లభించిందని క్రికెట్ న్యూసౌత్‌ వేల్స్ బుధవారం సిడ్నీలో వెల్లడించింది. ఈ ట్వంటీ20 ఈవెంట్‌కు గానూ న్యూసౌత్ వేల్స్‌కు చెందిన 20 మంది జట్టులో ఉన్న ఖవాజా ఈ వారం ఎంపిక చేసే తుది 15 మంది జాబితాలో చోటుదక్కించుకున్నట్లయితే ఛాంపియన్స్ లీగ్ ఆడటానికి భారత్‌కు వస్తాడు.

ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 9 వరకు భారత్‌లో జరుగుతుంది. తన వీసా ఆలస్యం కావడంపై ఈ లెప్ట్ హ్యాండర్ మంగళవారం సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.


దీనిపై మరింత చదవండి :