మూడో టెస్ట్: కుప్పకూలిన టాప్ ఆర్డర్, భారత్ 111/7

Hanumantha Reddy|
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ పేసర్ల దాటికి భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేశారు. క్రీజ్‌లో కాసేపు నిలబడకుండానే దిగ్గజ బ్యాట్స్‌మెన్లందరూ పెవిలియన్ దారి పట్టారు. భారత జట్టు మూడో టెస్ట్ తొలి రోజున తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన తొలి బంతికే పరుగులేమి చేయకుండానే అవుట్ అయ్యాడు. గంభీర్ (38), ద్రవిడ్ (22) కాసేపు నిలకడగా ఆడినప్పటికీ వీరిద్దరు అవుట్ అయిన తర్వాత భారత్ క్రమంగా తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సచిన్ కేవలం ఒక్క పరుగుకు అవుట్ కాగా లక్ష్మణ్ 30 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, బ్రెస్నన్‌లు చెరి మూడు వికెట్లు తీసుకోగా అండర్సన్‌కి ఒక వికెట్ లభించింది.


దీనిపై మరింత చదవండి :