మూడో టెస్ట్: తొలి బంతికే వెనుదిరిగిన వీరేంద్ర సెహ్వాగ్

Hanumantha Reddy|
భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య ప్రారంభమైన కీలకమైన మూడో టెస్ట్‌లో ప్రమాదకర బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. సెహ్వాగ్ డకౌట్‌గా పెవిలియన్ బాటపట్టడంతో ఇంగ్లాండ్ జట్టులో ఆనందం వెల్లువిరిసింది. స్టువార్ట్ బ్రాడ్ వేసిన షార్ట్ డెలివరీ సెహ్వాగ్ గ్లోవ్స్‌కి తగిలి కీపర్‌ చేతిలోకి వెళ్లింది.

అంతకుముందు ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. స్ట్రాస్ నిర్ణయాన్ని భారత కెప్టెన్ ధోనీ కూడా సమర్ధించాడు. పిచ్ తొలుత పేస్‌కు అనుకూలించే దృష్ట్యా తాను కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకొనేవాడినని తెలిపాడు.

జట్లు:

భారత్: వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సురేష్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్/ కీపర్), అమిత్ మిశ్రా, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, శ్రీశాంత్.

ఇంగ్లాండ్: ఆండ్రూ స్ట్రాస్ (కెప్టెన్), అలెస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, మాట్ ప్రియర్ (కీపర్), టిమ్ బ్రెస్నన్, స్టువార్ట్ బ్రాడ్, గ్రేమీ స్వాన్, జేమ్స్ అండర్సన్.


దీనిపై మరింత చదవండి :