ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అమలవుతున్న నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ను వన్డే, టీ-20ల్లోనూ ప్రయోగించాలని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ పద్ధతిని నేరుగా టెస్టుల్లో ప్రయోగించడం సరికాదని రికీ అన్నాడు. ఈ పద్ధతిని ఇంకాస్త మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నాడు.