గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 డిశెంబరు 2014 (11:27 IST)

కెప్టెన్‌గా ఉండి రిటైరైన రెండో క్రికెటర్‌గా ధోనీ రికార్డు!

టీమిండియాకు విజయాలు సంపాదించినప్పుడల్లా ధోనీని ఆకాశానికి ఎత్తేసిన జనం.. విజయాలు తగ్గిపోవడంతో ఒక్కసారిగా విమర్శలు గుప్పించింది. టీమిండియా సారథిగా వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ ధోనీ అనేక విజయాలను నమోదు చేశాడు. 
 
విదేశాల్లో పేలవమైన రికార్డును కలిగివున్నప్పటికీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కెప్టెన్‌గా ఉండి రిటైరైన రెండో క్రికెటర్‌గా ధోనీ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకూ మొత్తం 90 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడటమే కాకుండా 60 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం వహించాడు. 
 
ఈ 60 మ్యాచులలో 27 విజయాలు కాగా, 18 అపజయాలు నమోదయ్యాయి. 15 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఆడిన 90 టెస్ట్ మ్యాచుల్లో 4,876 పరుగులు చేసిన ధోనీ, 6 సెంచరీలు, 33 అర్థ సెంచరీలో నమోదు చేశాడు.