ఇషాంత్ శర్మ ప్రొఫైల్

FileFILE
భారత క్రికెట్ జట్టుకు దొరికిన మరో ఆణిముత్యం. ఢిల్లీకి చెందిన ఈ పేసర్ దేశవాళీ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. దీంతో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. తన స్వింగ్ పేస్ బౌలింగ్‌తో కంగారులను ఖంగు తినిపించిన ఈ లంబు ఆసీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ఈ పర్యటనలో గాయపడి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరమైన ఇషాంత్.. కాన్పూర్‌ టెస్టులో చోటు సంపాదించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి సఫారీలను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో భవిష్యత్ కలిగిన ఇషాంత్ శర్మ ప్రొఫైల్...

పూర్తి పేరు.. ఇషాంత్ శర్మ
పుట్టిన తేది.. సెప్టెంబరు 2, 1988, ఢిల్లీ.
ప్రస్తుత వయస్సు.. 19 సంవత్సరాల 223 రోజులు
ప్రధానంగా ఆడే జట్లు.. భారత్, ఢిల్లీ, ఇండియా రెడ్, కోల్‌కతా నైట్ రైడర్స్, నార్త్ జోన్
బ్యాటింగ్ స్టైల్ ... కుడిచేతి వాటం
బౌలింగ్ వాటం.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం

PNR| Last Modified శనివారం, 12 ఏప్రియల్ 2008 (13:37 IST)
మొత్తం టెస్టులు..5, ఆడిన ఇన్నింగ్స్..9 , తీసిన వికెట్లు..12, వన్డేలు.. 10, వన్డే ఇన్నింగ్స్ ..9, తీసిన వికెట్లు.. 14.


దీనిపై మరింత చదవండి :