శ్రీలంక మేటి స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్ల ప్రపంచ రికార్డుకు గాలె వేదికైంది. అద్భుతమైన స్పిన్ ఇంద్రజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ల గుండెల్లో దడపుట్టించిన ముత్తయ్య మురళీధరన్, గురువారం 800 వికెట్లు సాధించిన ఏకైక టెస్టు బౌలర్‌గా క్రికెట్ చరిత్ర సృష్టించాడు. భారత్‌తో గాలెలో జరిగిన తొలి టెస్టు ఐదో రోజైన గురువారం ముత్తయ్య 800 వికెట్ల రికార్డును సృష్టిస్తాడని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రజ్ఞాన్ ఓజా వికెట్‌ను స్పిన్ మాంత్రికుడు పడగొట్టడంతో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా గాలె టెస్టుకు అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్ స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న ముత్తయ్య, సూపర్ రికార్డు, ఘన వీడ్కోలుతో సంప్రదాయ ఫార్మాట్‌కు స్వస్తి చెప్పనున్నాడు. ఇందుకుగాను శ్రీలంక బోర్డు స్పిన్ మాంత్రికుడికి ఘన వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.