టీం ఇండియాలో కేరళ కెరటం... శ్రీశాంత్

WD PhotoWD
ప్రస్తుతం కుర్రకారుతో కలకలలాడుతోన్న టీం ఇండియాలో తనదైన ముద్రవేసిన ఆటగాడిగా శ్రీశాంత్‌ను పేర్కొనవచ్చు. అంతర్జాతీయ జట్టులోకి ప్రవేశించి మూడేళ్లైనా పూర్తికాని శ్రీశాంత్ ఆటాగాడిగానే కాకుండా వివాదాల నేపథ్యంతోనూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 14 టెస్టులు, 41 వన్డేలు పూర్తి చేసుకున్న ఈ యువ కెరటం వందకు పైగా వికెట్లు సాధించి తనలోని సత్తాను చాటి చెప్పాడు.

క్రీజులో ఉన్నప్పుడు అత్యంత చురుగ్గా ప్రవర్తించే శ్రీశాంత్ వికెట్ పడినపుడు తన బావోద్రేకాలని ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడడు అని చెప్పవచ్చు. నా తీరంతే నేను మారను అని నిర్మోహమాటంగా చెప్పే శ్రీశాంత్ పొపైల్‌ని ఓసారి పరిశీలిస్తే...

పూర్తిపేరు ... శాంతకుమారన్ శ్రీశాంత్
పుట్టినతేది ... ఫిబ్రవరి 6 1983
పుట్టిన స్థలం ... కేరళలోని కొత్తమంగళం
బ్యాటింగ్ శైలి ... కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి ... రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం
వన్డే కెరీర్ బౌలింగ్ ...
మ్యాచ్‌లు ... 41, ఇన్నింగ్స్‌లు ... 40
వికెట్లు ... 59
ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ... ఒకసారి
వన్డే కెరీర్ బ్యాటింగ్ ...
మ్యాచ్‌లు ... 41, ఇన్నింగ్స్‌లు ... 16
పరుగులు ... 34 అత్యధిక స్కోరు ... 10నాటౌట్
టెస్ట్ కెరీర్ బౌలింగ్
మ్యాచ్‌‍లు ... 14, ఇన్నింగ్స్‌లు ... 27
వికెట్లు ... 50
ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ... ఒక్కసారి
టెస్ట్ కెరీర్ బ్యాటింగ్
మ్యాచ్‌లు ... 14, ఇన్నింగ్స్‌లు ... 21
పరుగులు ... 217
అత్యధిక పరుగులు ... 35.


Munibabu|దీనిపై మరింత చదవండి :