దూసుకువస్తోన్న యువకెరటం రైనా

WD PhotoWD
భారత క్రికెట్ జట్టులో ఇటీవల తన ప్రభావం చూపిస్తోన్న యువకెరటం సురేష్ రైనా. బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల స్థిరంగా పరుగులు సాధిస్తోన్న రైనా అంతర్జాతీయ క్రికెట్‌లో తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా శ్రీలంకలో భారత పర్యటన సందర్భంగా రైనా తనలోని సత్తాను పూర్తిగా ప్రదర్శించాడు. ప్రస్తుతానికి వన్డే క్రికెట్‌లో మాత్రమే సత్తా చూపిస్తోన్న రైనా త్వరలోనే టెస్ట్ జట్టులోనూ స్థానం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఇటీవల బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ టోర్నీలో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఈ టోర్నీలో పాల్గొన్నాడు. శ్రీలంకతో 2005 జులై 30న జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన రైనా ఆనాటి నుంచి 50 వన్డేలు ఆడి 1191 పరుగులు సాధించాడు.

ఇందులో రెండు సెంచరీలతో పాటు ఏడు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. సురేశ్ కుమార్ రైనా అనే పూర్తి పేరు కల్గిన ఈ కుర్రాడు 1986 నవంబర్ 27న ఉత్తరప్రదేశ్‌లోని మురదంగర్‌లో జన్మించాడు.

సురేశ్ రైనా ప్రొఫైల్‌ను ఓసారి పరిశీలిస్తే...

పూర్తి పేరు - సురేశ్ కుమార్ రైనా
ఇప్పటివరకు ఆడిన టీంలు - భారత్, చెన్నై సూపర్ కింగ్స్, ఇండియా బ్లూ
బ్యాటింగ్ శైలి - ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్
Munibabu|
బౌలింగ్ శైలి - రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్.


దీనిపై మరింత చదవండి :