ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా మూడో స్థానంలో ఉన్నప్పటికీ... తన దృష్టిలో మాత్రం అన్ని పరిస్థితుల్లోనూ టీం ఇండియానే అత్యుత్తమ మేటి జట్టు అని శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ కితాబిచ్చాడు. అన్ని రకాలుగా మంచి ఊపులో ఉన్న టీం ఇండియా ఆస్ట్రేలియా సొంతగడ్డపైనే ఆసీస్‌ను మట్టిగరిపించిందనీ సంతోషం వ్యక్తం చేశాడు.