అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాం: బషర్

చిట్టగాంగ్ (ఏజెన్సీ)| WD| Last Modified ఆదివారం, 3 జూన్ 2007 (17:53 IST)
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ హబీబుల్ బషర్ అన్నాడు. అందువల్లే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయామని బంగ్లా కెప్టెన్ అన్నాడు. తమ ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బాగానే ఆడరాని బషర్ అన్నాడు. అయితే అవకాశాలు అందిపుచ్చుకొని రాణించే అనుభవం కొరవడిన కారణంగానే సిరీస్ కోల్పోయామని తెలిపాడు.

భారత్‌ను కొంతవరకు ఒత్తిడిలోకి నెట్టడంలో ఆటగాళ్లు విజయవంతం అయ్యారు. తొలి వన్డేలో అనుకున్న దానికన్నా బాగానే రాణించామని బషర్ తెలిపాడు. రెండో వన్డేలో కూడా చివరిదాకా పోరాడామని అయితే వచ్చిన అవకాశాలు జారవిడిచినందుకు మూల్యం చెల్లించుకున్నామని బషర్ పేర్కొన్నాడు.


దీనిపై మరింత చదవండి :