మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల మోత మోగించడానికి ఓ అపురూపమైన బ్యాట్‌ను ఉపయోగిస్తున్నారట. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో 50వ టెస్టు సెంచరీ కొట్టేందుకు మాస్టర్ ఉపయోగించిన బ్యాట్‌ను చూస్తే.. మాస్టర్‌కే బ్యాట్ల కొరతా అని అందరూ అనుకుంటారు. కానీ పాత బ్యాట్‌నే సచిన్ నమ్ముకంటాడట. దీని వెనుక సెంటిమెంట్ బలం అంతా ఇంతా కాదండీ.. ఇదే బ్యాట్‌తో లిటిల్ మాస్టర్ 14 శతకాలు కొట్టాడంటే.. ఆ బ్యాట్ ఎంతటి అపురూపమైందో అర్థం చేసుకోవచ్చు. నెట్ ప్రాక్టీసులో ఈ బ్యాట్‌ను ఎప్పుడూ వాడని సచిన్... మ్యాచ్‌ల్లో మాత్రం దీనిపైనే ఆధారపడతాడు. సెంచూరియన్‌లో సఫారీలపై చేసిన 111 పరుగులకు, తద్వారా టెస్టులో చరిత్ర సృష్టించడానికి ఈ బ్యాటే కారణమట.